ఘనంగా గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు వేడుకలు

🔸ముఖ్యఆతిధిగా హాజరైన జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు
🔸ప్రత్యేక పూజలు, మెగా వైద్యశిబిరం, మొక్కలు నాటడం, విద్యార్థినీ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
🔸మెగా ఫ్యామిలీ అభిమానులను కొనియాడిన గురాన

విజయనగరం, ప్రముఖ యువ నటుడు, మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు వేడుకలను గురువారం నాడు విజయనగరం జిల్లా చిరంజీవి యువత,అంజనీ పుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం మరియు అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా చిరంజీవి యువత,అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ప్రతినిధులు,జనసేన యువ నాయకులు లోపింటి కళ్యాణ్, సోమాధుల కుమార్, రౌతు కుమార్ ఘనంగా నిర్వహించారు. ముందుగా రాంచరణ్ గోత్రనామాలతో శ్రీ పైడితల్లి, ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కంటోన్మెంట్ రెల్లివీధిలో ఒడ్డి పోలమ్మ ఆలయంలో కాష్వి హాస్పిటల్ వారి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్యఅతిధిలుగా హాజరైన ప్రముఖ సంఘసేవకులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గురాన అయ్యలు,పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్య వేదిక అధ్యక్షులు ఆదాడ మోహనరావు, జనసేన రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి కాటం అశ్విని హరయ్యారు. ముఖ్యఅతిథిలుగా హాజరైన గురాన అయ్యలు, ఆదాడ మోహనరావు, కాటం అశ్విని కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా గురాన అయ్యలు మాట్లాడుతూ… ప్రపంచంలోనే మెగాఫ్యామిలీ అభిమానులు సేవల్లో ముందుంటారని, దీనికి నిదర్శనం ప్రపంచ నలుమూలలా మెగాభిమానులు ఉన్నారని,మెగాస్టార్ చిరంజీవి వేసిన సేవామార్గంలో ఇప్పటికే వెలకట్టలేని సేవాకార్యక్రమాలు మెగాభిమానులు చేస్తున్నారని, అంజనీ పుత్ర, జిల్లా చిరంజీవి యువత చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం లంకాపట్నం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థినీ విద్యార్థులకు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) పుస్తకాలు,పెన్నులు, స్వీట్స్ పంచిపెట్టారు. కాష్వి హాస్పిటల్ వైద్య శిబిరాల కో ఆర్డినేటర్ పి.కోటిబాబు, డాక్టర్ అనూష సేవలందించిన ఈ శిబిరంలో జనసేన వీరమహిళ మాతా గాయత్రి,తెలుగుదేశం పార్టీ నాయకులు మైలపల్లి పైడిరాజు, జిల్లా చిరంజీవి యువత, అంజనీపుత్ర, జనసేన యువ నాయకులు పిడుగు సతీష్, ముదిలి శ్రీనివాస్, బొబ్బాది చంద్రునాయుడు, చిన్ని, అరుగుల దిలీప్, బంగారు విజయ్, బొగ్గు సంతోష్, పొట్నూరు సాయి వంశీ, బంగారు జగదీష్, రౌతు రాంకుమార్ తదితరులు హాజరయ్యారు.

Share this content:

Post Comment