గుంటూరులో ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

గుంటూరు సిటీ, గురువారం సాయంత్రం ప్రముఖ సినీనటులు,గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకొని నగరంలోని ఆర్.అగ్రహారం మెయిన్ రోడ్డు నందు జనసేన పార్టీ నాయకులు, గుంటూరు నగరపాలక సంస్థ 18వ డివిజన్ కార్పోరేటర్ శ్రీ నిమ్మల వెంకటరమణ ఆధ్వర్యంలో మెగా అభిమానులు, జనసైనికుల సమక్షంలో అంగరంగ వైభవంగా కేక్ కటింగ్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మల వెంకట రమణ మాట్లాడుతూ స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల స్ఫూర్తితో అంచలంచెలుగా ఎదుగుతూ ఆస్కార్ స్థాయి ఎదిగిన రామ్ చరణ్ నేటి యువతకు ఎంతో ఆదర్శమని అన్నారు. జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య గారు మాట్లాడుతూ తన తండ్రి,బాబాయ్ ల వారసత్వాన్ని పునుకి పుచ్చుకొని సేవా కార్యక్రమాల్లో రామ్ చరణ్ తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు దళవాయి సుబ్రహ్మణ్యం, దొడ్డి కోటేశ్వరరావు,యర్రబోతు వాసు, పల్లపు దుర్గాప్రసాద్, యర్రగోపుల జయదీప్, ముక్తం భాషా, ఖర్జూర శ్రీను, అడపా బాలకృష్ణ, కన్నా శేషు, యిర్రి స్వరూప్, సోమరౌతు శీను , రంగా, షేక్ బాజీ, బంటి, తేజరాజు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment