నరసాపురంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

నరసాపురం, మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని నరసాపురం నియోజకవర్గ చిరంజీవి యువత ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ అని తన నటనతో నిరూపించుకున్నారన్నారు. నిరంతరం అభిమానులు చేస్తున్న పలు సమాజ సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సార్లు రక్తదానం చేసిన వారికి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాదంశెట్టి కోటేశ్వరరావు, వలవల నాని, బ్లడ్ బ్యాంక్ సమన్వయకర్త ఎనుముల సతీష్, అభిమానులు కోపల్లి శ్రీనివాస్, పోలిశెట్టి సత్తిబాబు, బోయిడి శ్రీనివాస్, అడ్డాల బాబి, దాసరి కృష్ణాజి, దివి సత్యన్, చెన్నం శెట్టి నాగు, బల్ల సత్తిబాబు, గుగ్గిలపు శివరామకృష్ణ, గ్రంధి శ్రీను, పోలిశెట్టి సాంబ, పులపర్తి సుబ్బారావు, పిల్ల శ్రీహరి, మేడిది ప్రభాకర్, దూసనపూడి కోటి, లక్కు బాబి, ముక్కు గిరి, జక్కం చిన్న, అడ్డాల రమేష్, కత్తుల యుగంధర్, మండ గోపి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment