ఘనంగా గ్లోబల్ స్టార్ జన్మదిన వేడుకలు

విజయనగరం జిల్లాలో రామ్ చరణ్ యువశక్తి, జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ బ్లడ్ బ్యాంక్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన నాయకుడు గురాన అయ్యలు మాట్లాడుతూ, రామ్ చరణ్ కు మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, అభిమానులను సంపాదించుకున్న నటుడిగా అభివర్ణించారు. ప్రతి సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ, నటనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగినప్పటికీ రామ్ చరణ్ వినయం, అంకితభావం మారలేదని, ఆయన సేవా కార్యక్రమాల్లో తండ్రి చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటూ సేవా కార్యక్రమాలను అధికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. మెగా ఫ్యామిలీ ఆశయ సాధనలో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా రామ్ చరణ్ యువశక్తి టీం సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం మెగా అభిమానులు, జనసేన నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి, స్వీట్స్ పంపిణీ చేశారు. రక్తదాతలకు మెమెంటోలు అందజేసి, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములైన వారికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మెగా అభిమానులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-27-at-2.08.57-PM-1024x576 ఘనంగా గ్లోబల్ స్టార్ జన్మదిన వేడుకలు

Share this content:

Post Comment