ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తూర్పుగోదావరి, అమలాపురం 73 వ భారతగణ తంత్రదినోత్సవ వేడుకలు జవహర్ లాల్ నెహ్రూ ఉన్నత పాఠశాల, అమలాపురం పురపాలక సంఘం పరిధి కొంకాపల్లిలో ఘనంగా జరిగాయి. తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.ఘన సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 20వ వార్డ్ జనసేన కౌన్సిలర్ తిక్కా సత్యలక్ష్మి విచ్చేసి భారత రాజ్యాంగం గురించి, రిపబ్లిక్ డే ప్రత్యేకతను గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం టీన్స్ ఫర్ ట్రూత్ ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో విజేతలకు కౌన్సిలర్ తిక్కాసత్యలక్ష్మి చేతుల మీదుగా బహుమతులు అందచేసారు. ఈ కార్యక్రమంలో తిక్కాప్రసాద్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మంచిగంటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ చోడే భారతి, సభ్యులు పార్వతి దేవి, వరలక్ష్మి, విజయ, కామేశ్వరరావు, ఉపాధ్యాయులు బి ఎన్. వెంకటేశ్వరరావు, కె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.