ఘనంగా హీరో వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు

*పేదలకు చీరల పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జన్మదినవేడుకలు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఘనంగా చేసారు. వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిండి రాజా ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ ఫ్యాన్స్ భారీ కేక్ కట్ చేసి అనంతరం పేదలకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన అమలాపురం నియోజకవర్గం ఇన్చార్జి శెట్టి బత్తుల రాజబాబు హాజరయ్యారు. అమలాపురం పట్టణ జనసేన అధ్యక్షులు పిండి సాయిబాబా, అఖిలభారత చిరంజీవి ఫాన్స్ ఉపాధ్యక్షులు, మున్సిపల్ ప్రతి పక్షనేత ఏడిద శ్రీను, చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు నల్లా చిట్టిబాబు, నల్లా నాయుడు, జనసేన కౌన్సిలర్ లు గండి హారిక స్వామి, పిండి అమరావతి, గొలకోటి విజయలక్ష్మి వాసు, జనసేన నాయకులు తిక్కా ప్రసాద్, మహాదశ నాగేశ్వరరావు, చిక్కాల సతీష్ మరియు మెగా అభిమానులు పాల్గొన్నారు.