గడప, గడపకీ కాదు ఈ గడపలకు రండి.. బోలెడు సమస్యలు వదిలి పట్టణంలో‌ పర్యటనలా..?

  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి
  • కోళ్ళబైలు పంచాయతీ బృందావన్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో జనం కోసం జనసేన

మదనపల్లి: ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కనీసం స్దానిక ప్రజా ప్రతినిధులు పట్టణ శివారు ప్రాంతాలలోని కాలనీలలో పర్యటించిన ధాఖాలు లేవని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి మండిపడ్డారు. బుధవారం మదనపల్లె రూరల్ మండలం కోళ్ళబైలు పంచాయతీ బృందావన్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర ఆద్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు సౌకర్యం లేకపోవడం, మురుగు నీరు రోడ్ల పైనే ప్రవహించడం గమనించారు. ‌కార్యక్రమంలో భాగంగా స్థానికులు గంగారపు రామదాస్ చౌదరికి ఘన స్వాగతం పలికారు. స్దానిక ప్రజలు తాము ఎద్కోంటున్న సమస్యలను గంగారపు రామదాస్ చౌదరి దృష్టికి తీసుకు వచ్చారు. డ్రెయినేజీలు లేకపోవడం, నడవడానికి సైతం వీలుకాని విధంగా రోడ్లు,‌ మంచినీటి సరఫరా లేకపోవడం స్థానికులు తమ ఇబ్బందులను వెల్లడించారు. ప్రజాప్రతినిధులు ఎవరూ తమను‌ పట్టించుకోకుండా వున్నారని వాపోయారు.‌ ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కొ కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ గడప, గడపకు అంటూ తిరుగుతున్న వైసిపి ప్రజాప్రతినిధులకు ఇక్కడి కాలనీలలో సమస్యలు‌ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‌రోడ్లపైనే మురుగునీరు ప్రవాహం నడవడానికి వీలుకాని విధంగా వుందన్నారు. 15 సంవత్సరాల క్రితం ముంజూరు చేసిన కాలనీలో నేటికి సమస్యలు పరిష్కారం కాకపోవడం దురదృష్ట‌కరం అన్నారు.‌ స్దానిక ప్రజల సమస్యలను సోమవారం ‌ఎంపిడిఓ కార్యాలయంలో అధికారుల‌‌ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చూపించని‌ పక్షంలో ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ దృష్టికి‌ తీసుకువెళ్లి‌ పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్దానిక నాయకులు ‌రాజారెడ్డి, రెడ్డి శేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రమేష్, అడపా సురేంద్ర, జగదీష్, తోట కల్యాణ్, లక్ష్మీపతి, అర్జున, రెడ్డెప్ప, స్వాతి, రెడ్డెమ్మ, నాగరాజు పాల్గొన్నారు. ‌