శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి గొన్నా రమాదేవి విరాళం

అనకాపల్లి : పరవాడ మండలం, నాయుడుపాలెం మరియు ముత్యాలమ్మ పాలెం గ్రామపంచాయతీ పరిధిలో హనుమాన్ నగర్ వద్ద నిర్మాణం జరుగుతున్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి పెందుర్తి జనసేన పార్టీ నాయకురాలు గొన్నా రమాదేవి విరాళం అందజేసారు. ఈ మేరకు 25,000/ వేల రూపాయలు ఖరీదు చేసే ఎలక్ట్రికల్ సామాగ్రిని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు విరాళ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయుకులు అరిజిల్లి అప్పలరాజు, సమ్మంగి అప్పారావు, నాయుడుపాలెం సర్పంచ్ కూండ్రపు వరలక్ష్మి సీతారామయ్య, సమ్మంగి సోమేశ్వరరావు, ఒలిశెట్టి అప్పలరాజు, ఈరుగుల లక్ష్మీప్రసాద్, కిలపర్తి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.