పుంగనూరు పుష్కరిణికి మంచి రోజులు..!

  • జనసేన నాయకుడు వేణుగోపాల్ రెడ్డి చొరవతో పనులు ప్రారంభం

పుంగనూరు, అమరశిల్పి జక్కన్న కుమారుడు చెక్కిన అద్భుతమైన కళాత్మకమై హాసిల్లుతున్న చారిత్రక పుంగనూరు పుష్కరిణికి మంచి రోజులు వచ్చాయి. దాదాపు 50 ఏళ్లుగా ఈ పుష్కరిందో నీరు వెలుపలకు వెళ్లేందుకు మార్గం మూసుకుపోయింది. క్రీస్తు శకం 1644లో పునర్నిర్మించబడిన పుంగనూరు కోనేరుకు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. హిందూ జాగరణ సమితి సభ్యులు కోనేరు సమస్యను జనసేన నాయకుడు ఎన్.వి.ఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన వేణుగోపాల్ రెడ్డి పుష్కరిణికి సంప్రోక్షణ సర్వశుద్ధి తో పాటు, పుష్కరిణిలో నిండి ప్రవహించే అదనపు నీరు వెలుపలికి వెళ్లే మార్గాన్ని పునరుద్ధరించేందుకు సోమవారం నుంచి చర్యలు చేపట్టారు. ఈ మేరకు పుష్కరిణివెనుక కోనేటి పాలెం నుంచి తాటిమాకుల పాలెం దారిలో ఎప్పుడో వందల ఏళ్ల క్రితం పాలకులు ఏర్పాటు చేసిన కోనేరు నీరు ప్రవహించే మార్గాన్ని జెసిబిలతో మళ్లీ త్రవ్వించి నీటి ప్రవాహం విశాలంగా వెళ్లేందుకు మార్గం సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో కోనేరు నీరు వెలుపలకు వెళ్లే మార్గం మూసుకుపోకుండా మళ్ళీ సమస్య రాకుండా ఉండేందుకు ఈ దారి వెంబడి పటిష్టమైన కాలువ నిర్మాణాన్ని చేపట్టేందుకు వేణుగోపాల్ రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు. కాగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రక పుంగనూరుకు పట్టుకొమ్మలా వర్ధిల్లుతున్న పుంగనూరు కోనేరు పునరుద్ధరించే చర్యలు చేపట్టిన జనసేన నేత వేణుగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతోంది పుంగనూరు.

Share this content:

Post Comment