బొలియశెట్టి శ్రీకాంత్ ఆద్వర్యంలొ గుడ్ మార్నింగ్ సీఎం సార్.. డిజిటల్ క్యాంపెయిన్

కృష్ణాజిల్లా: #GoodMorningCMSir.. డిజిటల్ క్యాంపెయన్ పోగ్రామ్ లో ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ.. మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ నుండి కవులూరు గ్రామానికి వెళ్లే రహదారిపై ప్రతి 50 అడుగులకు పెద్ద పెద్ద గుంటలు, గొయ్యలు.. కవులూరు గ్రామ ప్రజలు ఏ అవసరం వచ్చిన కొండపల్లి రావాలి. ఈ రోడ్లు మీద రావాలంటే నరకయాతన పడుతున్నారు. వారంలో రెండు మూడు సార్లు ఈ గొయ్యలో పడి ప్రమాదానికి గురి అవుతున్నారు. ఈ రోడ్లు పరిస్థితులు ఎప్పుడు బాగుపడుతుంది అని ప్రజలు వాపోతున్నారు. ఈ రహదారి సమస్యపై గత రెండు సంవత్సరాలుగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడుతున్నారు. పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఈ రోడ్డు త్వరగా వెయ్యాలి అని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారికి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసారు. చెయ్యని ఎడల ఈ రోడ్డు మరమ్మతులు జరగక పోతే రోడ్డు దిగ్బంధం చేస్తాం.. మరింతగా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ నాయకులు యర్రంశెట్టి సాంబశివరావు (నాని), పార్థసారథి, సురేష్, బండి వంశీ, జీలని, హేమంత్, రమేష్ పాల్గొన్నారు.