రోడ్ల దుస్థితి పై కుందుర్తి జనసేన డిజిటల్ క్యాంపెయిన్

3వ రోజు #GoodMorningCMSir డిజిటల్ క్యాంపైనింగ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గాని.. అనంతపురం జిల్లాలో గాని ఇలాంటి అద్వాన స్థితిలో ఉన్న రహదారి మరొకటి ఉండదు అని తెలీజేస్తూ బెస్తరపల్లి నుంచి జంబుగుంపల గ్రామాల మధ్య ఉన్న రహదారి ప్రదర్శించడం జరిగింది.

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం, కుందుర్తి మండలంలోని బెస్తరపల్లి నుంచి జంబుగుంపల గ్రామాల మధ్య ఉన్న రహదారి 20 సంవత్సరాలుగా గుంతలు ఏర్పడి, ఇలా కల్వర్టు తెగిపోయి ఒక చెరువు లాగా తయారు అయింది. ఇక్కడ స్థానిక వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారికీ, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు గ్రామస్తులు తెలిపినా పట్టించుకోవడం లేదు అని వాహనదారులు వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, మండల అధ్యక్షులు జయకృష్ణ, జనసేన వీర మహిళ షేక్ తార, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.