గాఢ నిద్రలో ఉన్న సీఎం ని తట్టి లేపేందుకే గుడ్ మార్నింగ్ సీఎం సార్: దెందులూరు జనసేన

దెందులూరు నియోజకవర్గం: గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నిద్రలేపి రాష్ట్రంలో రహదారుల దుస్థితిని, దాని వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి కళ్ళకుకట్టినట్టు చూపించడానికి శుక్రవారం దెందులూరు నియోజకవర్గం, కూచింపూడి గ్రామంలో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపైన్ నిర్వహించడం జరిగింది.