గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్ లో మర్రిపాడు జనసేన

ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై #GoodMorningCMSir హ్యష్ టాగ్ తో జూలై 15 నుండి 17 వరకు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేయండి అని జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుమేరకు మర్రిపాడు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో

గుడ్ మార్నింగ్ సి ఎం సార్ కార్యక్రమాన్ని మర్రిపాడు మండల పరిధిలోని అధ్వానంగా తయారైన రోడ్డు యొక్క మరమత్తులు త్వరగా జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతూ మర్రిపాడు మండల జనసేన పార్టీ తరఫున నిరసన తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి ఉపాధ్యక్షులు ఇరుపోతు ఉదయ్, గంటా అంజి బిల్లిపాటి మధు, బాలాజీ శంకర్ ముద్దుల కృష్ణ, చిన్నా జనసేన జనసైనికులు పాల్గొన్నారు.