గుడ్ మార్నింగ్ సిఎం సార్ డిజిటల్ క్యాంపెయినింగ్ లో పిఠాపురం జనసేన

పిఠాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపిచ్చిన రాష్ట్రవ్యాప్త కార్యక్రమం #GoodMorningCMSir నినాదంతో సాగిన డిజిటల్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాం శుక్రవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గంలో కందరాడ గ్రామం నందు మొదలై కుమరపురం, నరసింగపురం, జల్లూరు, సోమర్లకోట వరకు డిజిటల్ క్యాంపెనింగ్ చేయడం అయినది. నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన ఈ కార్యక్రమం జనసేన నాయకులు వెన్నా జగదీష్ నాయకత్వంలో కొనసాగి జిల్లా అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష, ఎంపిటిసి పిల్లా సునీత ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో వీరమహిళా నాయకులు పిల్లా రమ్యజ్యోతి, సలాది సుబ్బారావు, దళిత నాయకులు వాకపల్లి సూర్య ప్రకాష్, విరవాడ ఎంపిటిసి అభ్యర్థి రామిశెట్టి సూరిబాబు, పిల్లా లోవరాజు, శ్రీనాథ్, బావిశెట్టి రామకృష్ణ, సాధనాల రాజు, వాసంశెట్టి రాజు, గంజి గోవిందరాజు మరియు నియోజకవర్గ, రూరల్ జనసైనికులు పాల్గొన్నారు.