మద్దికేరలో రెండవ రోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం

#GoodMorningCMsir కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు ఛ్ఘ్ రాజశేఖర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు #GoodMorningCMsir డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా, శనివారం మద్దికేర మండలం నందు బురుజుల నుంచి మద్దికేర వరకు సుమారు 8 కిలోమీటర్లు ఉన్న పత్తికొండ నుంచి గుంతకల్ కు వెళ్లే ప్రధాని రహదారి అయిన ఈ రోడ్డుపై ఈ ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకు..? గత సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖున కూడా జనసేన పార్టీ తరఫున బురుజుల నుంచి మద్దికేర వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది.. కానీ ఫిబ్రవరి మార్చి మధ్యలో తూతూ మంత్రంగా ప్యాచర్లు వేసి, చేతులు దులుపుకున్న కాంట్రాక్టర్.. ఇలాంటి నాసిరికం పనులు చేసి ప్రజల సొత్తును వృధా చేస్తున్న ఈ వైసిపి ప్రభుత్వం.. ఇప్పటికైనా శాశ్వతంగా ఈ రోడ్డు నిర్మించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.. ఇలాగే రాష్ట్ర మొత్తం గుంతల పడిన రోడ్లు చూసి నిద్రపోతున్న సీఎం గారు కళ్ళు తెరుచుకొని ఇప్పటికైనా రహదారులపై దృష్టి పెట్టాలని కోరుచున్నాం. రాష్ట్రంలో బస్ చార్జీలు పెంచడానికి ఉన్న శ్రద్ధ, రోడ్లపై ఎందుకు లేదు.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న రోడ్లు అన్నిటికీ మరమ్మతులు వెంటనే చర్యలు చేపట్టాలి అని #ఘూదంఒర్నింగ్ఛంశిర్ డిజిటల్ ప్రోగ్రాం ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే గత సంవత్సరం కూడా సెప్టెంబర్ 2,3,4,తారీఖుల్లో రోడ్లు గురించి # JSP AP ROADS అనే డిజిటల్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గాడమైన నిద్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర లేపడం వల్ల ఆంధ్రప్రదేశ్ రోడ్లగురించి సీఎం జగన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లన్నీ 2022లో జూన్ లోపల బాగు చేస్తామని చెప్పి.. ఇప్పటికి కూడా రోడ్లకు మరమ్మత్తులు చేపట్టకు పోవడం, చాలా బాధాకరమైన విషయం, మన రాష్ట్రంలో అనేకసార్లు బస్సు చార్జీలు పెంచిన జగన్ మోహన్ రెడ్డి.. రోడ్ల గురించి ఎందుకు పట్టడం లేదు, ఇప్పటికైన నిద్రపోతున్న సీఎం గారిని మరోసారి నిద్ర లేపుతూ.. రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని.. జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మద్దికేర మండల జనసేన పార్టీ నాయకులు గద్దల రాజు, మనొజ్ కుమార్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, నరేష్ యాదవ్, తిమ్మప్ప, అవినష్, రావుల అంజి, యుగంధర్, రామచంద్ర, వంశీ, గణేష్, లింగ జితేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు.

#GoodMorningCMSir