గుడ్ మార్నింగ్ సీఎం సార్.. రోడ్ల దుస్థితి పై సాయి శరత్ డిజిటల్ క్యాంపెయిన్

మరమ్మతులకు నోచుకోని గ్రామీణ రహదారుల వల్ల నియోజకవర్గంలో ప్రజలు, వాహనదారులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. పాలకులు పట్టించుకోకపోవడంతో రహదారులు అధ్వానంగా మారి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి.

నియోజకవర్గంలోని నాలుగు మండలాలలోనూ ఇదే దుస్థితి నెలకొని ఉందంటే పాలకుల నిర్లక్ష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పెదపాడు మండలం లోని పెదపాడు – పెరికీడు ఆర్ అండ్ బి రహదారి, కొక్కిరిపాడు నుండి వట్లూరు, వేంపాడు నుండి భోగాపురం, వట్లూరు నుండి సత్రంపాడు పెదవేగి మండలంలో విజయరాయి, జానంపేట రోడ్డు, ఏలూరు మండలం లో మాదేపల్లి శ్రీపర్రు మీదుగ కైకలూరు వెళ్లే రోడ్డు, చాటపర్రు మీదుగా లంక గ్రామాలకు వెళ్ళే రోడ్లు ఇలా నియోజకవర్గంలో నలువైపులా అన్నీ పూర్తిగా ధ్వంసమైపొయాయి.

ఈ పరిస్థితిని ప్రభుత్వం వారికి ఉన్న యంత్రాంగం ద్వారా తెలుసుకోలేని.. ఒకవేళ తెలుసుకున్నా పట్టించుకోలేని అసమర్ధతతో ఉంది కాబట్టి ఇవాళ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిద్ర లేపాలనే ఉద్దేశ్యంతో goodmorningCMsir అనే నినాదంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన తరపున డిజిటల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ అన్నారు. ప్రజల తరఫున జనసేన పార్టీ ప్రజా గళమే తమ గళంగా ప్రభుత్వానికి తెలియచేప్పే దిశగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది.