అరకు జనసేన ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్.. డిజిటల్ క్యాంపెయిన్

* రాష్ట్రంలో రోడ్ల దుస్థితి పై ముఖ్యమంత్రి వైఖరి ఏమిటో చెప్పాలి,
జనసేన పార్టీ నాయకులు సాయిబాబా దురియా, అల్లంగి రామకృష్ణ, కిలో రాజా భారత్

అరకు నియోజకవర్గం, అరకు నియోజకవర్గ కేంద్రంలో గల కొత్త బల్లుగూడ పంచాయతీ పరిధిలోగల సుకూరు గూడా, కొర్రో గూడా గ్రామాల్లో జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆయా గ్రామాల్లో శుక్రవారం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, మండల అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ, కిలో రాజా భరత్ తదితరుల ఆధ్వర్యంలో ఆయా గ్రామ రోడ్ల దుస్థితి పై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ.. గత నెల మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జూలై 15 కల్లా రాష్ట్రంలో ఉన్న రోడ్ల గుంతలు ఉండవని, రోడ్ల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని చెప్పిన మీరు నేటి వరకు పూర్తి చేయకపోవడంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మీ తీరు చాలా విడ్డూరంగా ఉందని.. ఇప్పటికైనా జనసేన పిలుపుతో రోడ్ల దుస్థితి దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసైనికులు వీర మహిళలు రామారావు, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

GoodMorningCMSir