రైల్వే కోడూరు లో గుడ్ మార్నింగ్ సీఎం సార్.. డిజిటల్ క్యాంపెయిన్

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర రోడ్ల దుస్థితి మీద డిజిటల్ క్యాంపెయినింగ్ 15,16,17 తేదీలలో జరుగుతుంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితి మీద తమ గ్రామాలలో పంచాయితీలలో హైవే రోడ్డు మీద గుంతలు పడ్డ రోడ్ల ఫోటోలు తీసి సోషల్ మీడిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ క్యాంపెనింగ్ #GoodMorningCMSir అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో పొందు పర్చడం జరుగుతుంది. జనసేన పార్టీ ద్వారా చేపడుతున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో రోడ్లను సౌకర్యవంతంగా ప్రభుత్వ౦ నిర్మించేలా ఒత్తిడి తీసుకురావడమే.

కార్యక్రమంలో భాగంగా శుక్రవారం.. రైల్వే కోడూరు టౌన్ పోస్టాఫీస్ ఎదురుగా గుంతలు పడ్డ రోడ్డును మరియు బుడుగుంటపల్లె రోడ్డును సుమారు ఇరవై గ్రామాలను కలిపే ఈ రహదారి నిర్మాణం గత దశాబ్దకాలంగా సౌకర్యవంతమైన రోడ్డుకు నిర్మాణం జరిగేలా ఎవరు చర్యలు తీసుకోలేదు. ఈ రెండు రోడ్ల దుస్థితి మీద సోషల్ మీడియాలో అవగాహన కలిగించేలా పోరాటం చేయడం జరిగింది. కోడూరు ఎమ్మెల్యే తక్షణమే రోడ్ల దుస్థితిని మార్చేలా ముందుకు రావాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉత్తరాది శివకుమార్, ముత్యాల కిశోకుమార్, మర్రి రెడ్డిప్రసాద్, రవికుమార్, గిరిధర్, దశరథ్, మరియు బుడుగుంటపల్లె గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. #GoodMorningCMSir