గాన గందర్వుని ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

కోట్లాది మంచి అభిమానుల పూజలు ఫలించడంతో ఎస్పీ బాలు కోలుకుంటున్నారు. క్రిటికల్ కండిషన్ నుంచి ఆయన కోలుకుంటున్నారని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని చికిత్సకు స్పందిస్తున్నారని చెన్నై ఎంజీఎం వైద్యులు తెలిపారు.

తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి అప్ డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తున్న ఎస్పీ తనయుడు చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘గత నాలుగు రోజులుగా నాన్నగారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. చాలా బెటర్ మెంట్ ఉంది.. దేవుని దయతో ఈ వీకెండ్ వరకు అభిమానులు సంతోషకరమైన వార్త వింటారు. అభిమానులు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఆయన కోలుకుంటున్నారు. వీరి ప్రార్థనల ఫలితంగా ఈ సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని ఎస్పీ తనయుడు చరణ్ ఇన్ స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో తెలిపారు.