‘జెర్సీ’ చిత్రబృందానికి శుభవార్త

తెలుగులో పలు ప్రశంసలు దక్కించుకున్న ‘జెర్సీ’ చిత్రాన్ని ఆగస్టు 9 నుండి 15 వరకు జరిగే భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ‘జెర్సీ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సందర్బంగా ఈ చిత్ర  నిర్మాత నాగవంశీ  మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న కెనడాలో మా చిత్రం ప్రదర్శితం కానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఇదిలా ఉoడగా ‘జెర్సీ’ హిందీలో రీమేక్‌ అవుతోంది. షాహిద్‌ కపూర్‌ హీరోగా ఈ రీమేక్‌ని దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు.