*గోదావరి జలాలకు జలహారతి
పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి మోటార్లను ఆన్ చేసి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేస్తూ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బర్రింకలపాడు సమీపంలోని డెలివరీ పాయింట్ వద్ద గోదావరికి జలహారతి ఇవ్వడం జరిగింది. వరదల నేపథ్యంలో, శాస్త్రోక్తంగా కార్యక్రమం చేపట్టి పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు పంపించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడును పోలవరం ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment