డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆర్ధిక సహకారంతో మంచి నీళ్ళు సరఫరా

రాజోలు నియోజకవర్గం, మల్కిపురం మండలం, అడవిపాలెం గ్రామంలో గత 4 వారాలుగా మంచినీళ్లు రావడం లేదని అధికారులకి చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 3 రోజులుగా రాజోలు నియోజకవర్గ జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంక్ తో డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆర్ధిక సహకారంతో మంచి నీళ్ళు సరఫరా చేయడం జరిగుతుంది. డాక్టర్ రమేష్ బాబు అడవిపాలెం గ్రామంలో వెళ్లి అక్కడ ప్రజల మంచినీటి సమస్యలను తెలుసుకుని అధికారులకు తెలియజేయడం జరిగింది. 2 రోజుల్లో వారి సమస్యను పరిష్కరించాలని అధికారులకి తెలియచేసారు. ఈ కార్యక్రమంలో బట్టేలంక ఎంపీటీసీ ఆవుపాటి శివజ్యోతి సుబ్రహ్మణ్యం, శంకరగుప్తం గ్రామశాఖ అధ్యక్షులు దూది శంకర్, రాపాక మహేష్ తదితరులు పాల్గొన్నారు.