మంచి నీటి సరాఫరా..!

కళ్యాణదుర్గం పట్టణ మున్సిపాలిటీలోని 12వవార్డు, కమ్మన్ చెట్లవీధిలో అత్యవసర మంచినీటి కొరత ఏర్పడడంతో కమ్మన్ చెట్లవీధిలో గల ప్రజలు, మహిళలు స్థానిక జనసేన ముఖ్య నాయకులు గంగరాజుని కలిసి నీటి సమస్యను తెలియజేశారు. జనసేన నాయకులు గంగరాజు వెంటనే టిడిపి ముఖ్య నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ వై.పి.రమేష్ కి మంచినీటి సమస్యను తెలియజేశారు. దీనికి వై.పి.రమేష్ వెంటనే స్పందించి మంచినీటి ట్యాంకర్ ను అందుబాటులో ఉంచారు. జనసేన నాయకులు గంగరాజు తానే స్వయంగా మంచినీటి ట్యాంకర్ ను తీసుకొనివెళ్లి 12వవార్డులోని కమ్మన్ చెట్లవీధిలో గల ప్రజలకు మంచి నీటిని సరాఫరా చేశారు. ఈ సందర్భంగా 12వవార్డు కమ్మన్ చెట్లవీధిలోని ప్రజలు, మహిళలు జనసేన నాయకులకు, టిడిపి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన నాయకులు గంగరాజు, జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ అడిగిన వెంటనే మంచినీటి ట్యాంకర్ ను పంపించిన వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ & మాజీ మున్సిపల్ చైర్మన్ వై.పి.రమేష్ కి మరియు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share this content:

Post Comment