*సర్వేపల్లిలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ
సర్వేపల్లి, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ముత్తుకూరు మండలంలో మద్యం, డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తూ – “మత్తు పదార్థాలకు బానిసలవ్వడం ద్వారా వ్యక్తిగత జీవితమే కాకుండా కుటుంబాలూ ధ్వంసమవుతున్నాయి. యువతీ యువకులు ఈవిషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా వారి చేతిలోనే ఉంది,” అని అన్నారు. కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తును బంగారుబాటలో నడిపించేందుకు అండగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లల పై నిరంతరంగా దృష్టి పెట్టి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, మస్తాన్, సుమన్, చిన్న సందూరి శ్రీహరి, మస్తానయ్య, రమణయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment