గుడ్ మార్నింగ్ సీఎం సార్ తిరుపతి జనసేన వినూత్న నిరసన

తిరుపతి: ఏపిలో రహదారుల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరుతో తిరుపతిలో జనసైనికులు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, నగర ప్రెసిడెంట్ రాజారెడ్డి అధ్వర్యంలో నిరసన తెలిపారు. రోడ్లపై ప్రయాణం చేస్తే నేరుగా ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి ఉందంటూ, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు నానా సమస్యలు ఎదుర్కుంటున్నారని జనసేన నేతలు మండిపడ్డారు. ఇకనైనా రోడ్ల నిర్మాణం పై దృష్టి పట్టకపోతే గుడ్ మార్నింగ్ సీఎం సార్ పోయి గుడ్ బాయ్ జగన్ సార్ అనే రోజుకు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , వీర మహిళలు పాల్గొన్నారు.