పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేసిన గోరంట్ల జనసేన

గోరంట్ల: వైసీపీ పార్టీ మంగళవారం వాలంటీర్లతో కలసి గోరంట్లలో పవన్ కళ్యాణ్ బొమ్మ దాహనాన్ని నిరసిస్తూ బుధవారం అదే చోట గోరంట్ల జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను అధికార పార్టీ నాయకులు వక్రీకరించి వాలంటీర్లను కావాలనే రెచ్చగొడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంద్రప్రదేశ్ లో 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు అని పవన్ కళ్యాణ్ గారు చెబితే దానికి సమాధానం చెప్పలేక అధికార వాలంటీర్లను రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి జీవితం గురించి మాట్లడుతూ ఉన్నారు ఇప్పటికి అయినా ఈ ప్రభుత్వం మేల్కొని మహిళలకు రక్షణ కల్పించి అలాగే కనపడకుండా పోయిన మహిళలను వెతకాలి అని తెలియజేసారు. అదేవిధంగా గోరంట్లలో అధికాపార్టీ వారు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మను దహనం చేసినా జనసేన పార్టీకి ఏమి నష్టం జరగదు అని వారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, మండల అధ్యక్షుడు సంతోష్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, కార్యక్రమాల జిల్లా కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, ఐటీ కో ఆర్డినేటర్ యోగనందరెడ్డి, మండల నాయకులు నాగేంద్ర, రాఘవ, తిరుపల్, నరేష్, శ్రీనివాసులు, నాగేష్, రాజేంద్ర, బాలు, వెంకటరమణ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.