Jaggayyapeta: ఎయిడెడ్ కాలెజీల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి

కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలో గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ విద్యార్థులు కాలేజ్ స్టూడెంట్స్ రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసే ఈ విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విద్యార్థులను పీల్చి పిండి చేసే విధంగా వ్యవహరిస్తోంది స్కూల్ కావచ్చు కాలేజెస్ ఫీజులు విద్యార్థుల మీద భారం వేయడం చాలా అన్యాయం బాధాకరం తక్షణమే ఈ ప్రభుత్వం ఎయిడెడ్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని జనసేన తరపున డిమాండ్ చేస్తున్నామని అలానే జగ్గయ్యపేటలో ఉన్న ఎస్ జి ఎస్ కాలేజీలోని స్టూడెంట్స్ కి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని జనసేన నాయకులు తునికిపాటి శివ డిమాండ్ చేశారు.