జనసేన నిరసనకు రోడ్లు నిర్మించిన ప్రభుత్వం

చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, దామలచెరువు పంచాయతీ, కట్టకిందపల్లి ఎదురుగా పీలేరు నుండి చిత్తూరు జాతీయ రహదారి గుంతలమయం అయ్యి, దాదాపు కిలోమీటర్ మేరకు అధ్వాన్న స్థితికి చేరింది. ఈ రహదారి గుండా ఎన్నో వెల మంది ప్రతి రోజు ప్రయాణిస్తారు. ఎంతో మంది ప్రమాదవశాత్తూ పడి ఇబ్బందులు కూడా పడ్డారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు ఈ రోడ్డు గురించి గుడ్ మార్నింగ్ సి ఎం సార్ అనే కార్యక్రమాన్ని జూలై 17 న నిర్వహించి నిరసన చేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించి రోడ్డుని నిర్మించారు. అదే రోజున దామలచెరువు నుండి పాకాల రోడ్డు గురించి నిరసన తెలియచేస్తుంటే వైసీపీ నాయకులు కొంత మంది వచ్చి దుర్భషాలాడి కారుతో తొక్కించేస్తాం, మీ నాయకుడు మీ పార్టీ వల్ల ఏమి ఉపయోగం అని హేళన చేసారు. దానికి బదులుగా ఆ రోజే వాళ్ళ చెంప చెల్లుమనిపించేలా జనసేన నాయకులు బదులు ఇవ్వడం జరిగింది. ఆ హేళన చేసినటువంటి, అధికార మదంతో కొట్టుకుంటున్న వారికి ఇదే సమాధానం, ఇదే ఉదాహరణ. నిజమే పవన్ కళ్యాణ్ వెంట ప్రజలు 2019 నడవకపోయినా, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కుమ్మక్కయ్యినా, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినా, అధికారంలో లేకపోయినా, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్న మీ వైసీపీ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తూ, మీకు కుర్చీల కింద ప్రకంపణలు సృష్టిస్తూ, మిమ్మల్ని పరుగులు పెట్టిస్తున్నాడు, నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ ని తలుచుకొని బయపడేట్టు చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ జనసేన విజయమే. ఈ సందర్భంగా ఆ రోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి జనసేన నాయకులు, చిత్తూరు జిల్లా కార్యదర్శి మనోహర్ దేవర, రాష్ట్ర కార్యదర్శి ఆకెపాటి సుభాషిణి, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ జనసేన, యువరాజ్ పగడాల, ఆశా, వాసు రాయల్, రమేష్, హరి, రవి, మహమ్మద్ ఇమ్రాన్, ఆసిఫ్, అహ్మద్ లకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నానని చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్ అన్నారు.