ప్రభుత్వానికి సినిమా టికెట్లు, మద్యం రేట్లు మీద ఉన్న ఆసక్తి రైతుల మీద లేదు: బాబు పాలూరు

విజయనగరం జిల్లా, పార్వతిపురం నియోజకవర్గం సీతానగరం మండలంలో గల లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం దాదాపు ఐదు సంవత్సరాల నుంచి రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.. చివరకు చెరుకు రైతులు సహనం కోల్పోయి ఫ్యాక్టరీ వద్ద నిరసన రూపంలో తమ గోడును ప్రభుత్వానికి యాజమాన్యానికి విన్నవించుకుందామని ఆందోళనకు దిగితే, ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రభుత్వం, పోలీస్ శాఖ ముగ్గురూ కలిసి రైతులను అక్రమంగా అరెస్టు చేసి వారిపై అక్రమ కేసులు పెట్టడం జరిగింది. చివరకు రైతులపై లాఠీఛార్జి చేయడం రైతులు తీవ్ర గాయాలు పాలవ్వడం జరిగింది. వెంటనే జనసేన పార్టీ ఆ విషయం తెలుసుకొని రైతులకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. తరువాత రెండు రోజుల వ్యవధిలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరు ఆధ్వర్యంలో జనసైనికులు అంతా కలిసి తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి శ్రీ బొత్స సత్తిబాబు పదిరోజుల్లో రైతులు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే రోజులు గడుస్తున్నా రైతులకు న్యాయం జరగకపోగా నిన్న రాత్రి సాలూరు మక్కువ సీతానగరం మొదలైన మండలాల్లో గల రైతులకు గ్రామానికి 5 మందికి చొప్పున దాదాపు పది సెక్షన్ల కింద రైతులపై కేసులు పెట్టి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో కంగారుపడ్డ రైతులు ఉదయాన్నే రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ బాబు పాలూరుకి ఫోన్ చేయడం జరిగిన విషయం చెప్పడం జరిగింది. వెంటనే బాబు స్పందించి మీకు మేము అండగా ఉంటామని చెప్పి బొబ్బిలి రూరల్ సిఐ ఆఫీస్ వద్దకు వెళ్ళి రైతులను కలిసి మాట్లాడారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రైతుల ఆవేదనను మీడియా ముందు చెప్పమని రైతులకు అవకాశం ఇచ్చిన తర్వాత మీడియాతో కూడా బాబు పాలూరు మాట్లాడం జరిగింది. బాబు పాలూరు మాట్లాడుతూ ఆరోజు శ్రీ బొత్స సత్తిబాబు నిరసన చేసింది రైతులు కాదు జనసేన రైతు సంఘాలు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళు అని చెప్పి అన్నారు మరి ఈ రోజు రైతులపైన ఏ విధంగా కేసులు పెడతారు అని మీడియా ముఖంగా నిలదీశారు. మీకు మీ ప్రభుత్వానికి సినిమా టికెట్లు రేట్లు గురించి మద్యం రేట్లు గురించి ఉన్న ఆసక్తి రైతుల పట్ల ఎందుకు ఉండట్లేదు అని ద్వజమెత్తారు. అలాగే రైతులకు మేము ఎప్పటికీ అండగా ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. వెంటనే రైతులకు న్యాయం చేయకపోతే జనసేన పార్టీ నిరసనను ఇంకా తీవ్రతరం చేస్తుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.