జనసేన చొరవతొ కదిలిన ప్రభుత్వ యంత్రాంగం

నూజివీడు: జగనన్న కి చెబుదాం అంటూ ప్రజలకి ముఖ్యమంత్రిగారు మీ ప్రాంతంలో సమస్యలు తన దృష్టికి తీసుకురమ్మని పిలుపునిచ్చిన సందర్బంగా.. శనివారం ఆగిరిపల్లి మండల జనసేన నాయకులు జన్యవుల బాబి, జన్యవుల వెంకట అనిల్, పొలగాని కళ్యాణ్ స్పందన ద్వారా ఆగిరిపల్లి మండల కొమ్మురు గ్రామంలో పెద్ద చెరువు అభివృద్ది, కొమ్మూరు నుండి మలవల్లి రోడ్డు నిర్మాణం కోసం విజ్ఞప్తి చేయడంతో వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తమ పరిధిలో ఉన్న ఇంజనీర్ గారు సంబందిత రోడ్లు నిర్మాణం కోసం ఎస్టిమేట్లు వేసి పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు పంపించడం జరిగింది. అయితే నూజివీడు డివిజన్ పంచాయతీ రాజ్ శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ గ్రామ నాయకులతో మాట్లాడి రోడ్లు, డ్రైనేజ్ అభివృద్ది కోసం నిధులు విడుదల చేసి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా పరిష్కార భాధ్యత ప్రభుత్వం మీద, స్థానిక నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ పైన ఉంది.