రైతులు పండించిన బి.పి.టి ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయాలి: అవనిగడ్డ జనసేన

అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గంలోని రైతులు, కౌలు రైతులు పండించిన ఖరీఫ్ పంటకు సంబంధించిన బి.పి.టి వరి ధాన్యంను ప్రస్తుతం పంట నూర్పిడి చేసుకుని.. ధాన్యంను అమ్ముటకు ప్రయత్నించుచుండగా ప్రభుత్వం కొనుగోలు చేయని కారణంగా.. ప్రైవేట్ వ్యాపారస్తులు తక్కువ రేటుకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు.

గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన విధంగానే ప్రస్తుతం కూడా రైతులు, కౌలు రైతులు పండించిన బి.పి.టి వరి ధాన్యంను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని శనివారం అవనిగడ్డ మండల జనసేన పార్టీ తరపున స్థానిక తహశీల్దార్ కార్యాలయం నందు వినతిపత్రం సమర్పించడం జరిగింది.

అదే విధంగా ఈ విషయం గురించి సోమవారం నాడు స్పందనలో కలెక్టర్ కార్యాలయoలో కూడా వినతిపత్రం సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, చన్నగిరి సత్యన్నారాయణ, ఎంపీటీసీ వసంత్, ఎంపీటీసీ భాను, అశ్వారావుపాలెం ఉపసర్పంచ్ యక్కతి నాగరాజు, రాజనాల వీరబాబు, మండలి శివ, బొప్పన పృథ్వి, బచ్చు శ్రీహరి, బచ్చు రఘునాథ్, తుంగల వేణు, తుంగల నరేష్, కోసూరు అవినాష్, నరేష్ కమతం, బాలు (పవన్ భక్తుడు), గుగ్గిలం అనిల్, అప్పకట్ల భాస్కర్, పప్పుశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.