అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

  • జనసేన, తెలుగుదేశం నేతలు

ప్రత్తిపాడు నియోజకవర్గం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం అంగన్వాడీ టీచర్లు మరియు వర్కర్స్ పరిస్థితి చాలా దయనీయంగా వుందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త కోర్రపాటి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా వట్టచెరుకూరు మండల ఆఫిస్ వద్ద జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో జరిగినది. పాదయాత్ర చేసి ముద్దులు పెట్టిన ఈ ముఖ్యమంత్రి జగన్ ప్రజలు అసహ్యించుకునే విధంగా పరిపాలన సాగిస్తున్న విధానం అందరికీ తెలిసిందేనని నాగేశ్వరరావు అన్నారు. రానున్న రోజుల్లో మన జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం వస్తుందిని అప్పుడు మీ ఇబ్బందులను పరిష్కారం చేయగలరని చెప్పినారు. గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు తమ సొంత డబ్బులతో ముందుగా పెట్టుబడి పెట్టి పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు ఆహారాన్ని ఆందిస్తున్నారు. వారికి వేతనం సక్రమంగా రాక, అద్దె భవనాల్లో వుంటూ టైం కి అద్దె చెల్లించక చాలిచాలని జీతంతోటి ఇంటా, బయట పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంకటరత్తయ్య తెలియజేశారు.
వట్టచెరుకూరు మండలం, తెలుగుదేశం పార్టి అధ్యక్షుడు మన్నవపూర్ణ చంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అంగన్వాడీ సెంటర్ల పర్యవేక్షణ పేరుతో పుడ్ కమీషన్ ఛైర్మన్, తదితరులు విజిట్స్ పేరుతో అంగన్వాడీలను వేధింపులకు గురి చేయుచున్నారని ఆయన అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు వరికూటి నాగరాజు మాట్లాడుతూ అంగన్వాడీలకు సరిఅయిన పూర్తి ఉద్యోగ భద్రత మరియు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేలియజేసినారు. వింజనంపాడు తెలుగుదేశం మండలం పరిషత్ సభ్యురాలు శ్రీమతి ఉప్పుటూరి సుజాత మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, వర్కర్స్ డిమాండ్లను ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కారించి వారిని రోడ్లపై పడకుండా ఆదుకోవాల్సిన భాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టి వట్టచెరుకూరు మండల అధ్యక్షులు పత్తి భావన్నారాయణ, మండలి నాయకులు అల్లం దశరధరామయ్య, గంగిశెట్టి వెంకట్, అంగన్వాడీ మండల నాయకురాలు పద్మ, ప్రేమలత, రత్ననాగమణి, తెలుగుదేశం, జనసేన పార్టీ మండల, గ్రామ స్థాయి నేతలు, వీరమహిళలు, అంగన్వాడీ టీచర్లు వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.