చిలకలూరిపేట, బర్లీ పొగాకు రైతులను ఆదుకోవాలని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి కోరారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ గతేడాది మర్చి పంట వేసి నష్టపోయిన రైతులు క్వింటా పొగాకుకు రూ.15 వేలు ధర పలకడంతో కర్నూలు నుంచి కృష్ణా జిల్లా వరకు రైతులు వైట్/బ్లాక్ బర్లీ రకాన్ని వేశారని వెల్లడించారు. ‘సాగు చేయండి. మేమొచ్చి కొంటాం’ అని అభయమిచ్చిన పొగాకు సంస్థలు.. తీరా పంట చేతికొచ్చే సమయానికి ముఖం చాటేసాయన్నారు. చేసేది లేక తీవ్ర నష్టానికి రైతులు రూ.2,500 నుంచి రూ.3 వేలకు దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కంపెనీలతో చర్చించి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా చూడాలని కోరారు.
- బర్లీ పొగాకును పోగాకు బోర్డు పరిధిలోకి తేవాలి
వర్జీనియా పొగాకు పొగాకు బోర్డు నియంత్రణ ఉండటం వల్ల ఆ పంట సాగుచేసిన రైతులకు ఇబ్బందులు ఉండవని చెప్పారు. ప్రైవేటు సంస్థలు రైతులతో ఒప్పందం చేసుకొని, విత్తనాలిచ్చి.. సాగు చేయిస్తాయని వెల్లడించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో నల్ల నేలల్లో బ్లాక్ బర్లీ, ఎర్ర నేలల్లో వైట్ బర్లీ సాగు చేశారని, గతేడాది ధర చూసి ఈసారి కొందరు రైతులు భూమి కౌలుకు తీసుకొని మరీ పొగాకు వేశారని తెలిపారు. మిర్చి పంట వేసి నష్టపోయిన రైతులు బర్లి పొగాకు రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. బర్లీ పొగాకును కూడా బోర్డు పరిధిలోకి తీసుకొని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. - జగన్ రైతు ద్రోహి
జగన్ రైతు ద్రోహి అని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినా బాధితులను పరామర్శించలేదని, అధికారం కోల్పాయాక పరామర్శల పేరుతో రాజకీయాలకు పాల్పడుతున్నారని బాలాజి ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.
Share this content:
Post Comment