రాజకీయ లబ్దికోసం ప్రజల్ని వాడుకుంటున్న ప్రభుత్వం: వంతల బుజ్జిబాబు

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తమ్మంగుల పంచాయతీ వర్తనపల్లి గ్రామము వైస్సార్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో చేస్తున్న పనులకు ఎలా గడప గడపకు తిరగాలని చెప్తుంది ? ఏమిచేసింది ఎక్కడ చూసినా అరాచకాలు దోపిడీ దౌర్జన్యంతో రాజకీయ లబ్దికోసం ప్రజల్ని వాడుకుంటున్న ప్రభుత్వం ఏమని గడప గడపకు తిరగాలనిపిస్తుందని ఎక్కడ చూసినా సమస్యలతో సుడిగుండంలా చుట్టేసిన పరిస్థితి ఉందని కనీసం గిరిజన ప్రాంతాల్లో దళిత సామాజిక వర్గాలకు చెందిన వాళ్లకు ఇచ్చిన పధకాల కోసమా? ఏ ప్రాంతానికి వెళ్లినా తమ యొక్క బ్రతుకు మనుగడ కోసం ఎలా కొనసాగించాలని చెప్పుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారని… మేమంతా మా మనుగడ దెబ్బతీసుకోవడానికే వైస్సార్ పార్టిని ఎన్నుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధిని నిపివేసి అప్పుల రాష్ట్రంగా ఏర్పడిన పరిస్థితి ఉందని అన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండరుని ప్రకటిస్తామని చ్ప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్డున పడవేసి ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై తప్పుడు కేసులు పెట్టి నడిపిస్తున్న ప్రభుత్వం సమాజానికి ఏమీ న్యాయం చేస్తుందని చింతపల్లి మండల జనసేన నేత వంతల బుజ్జిబాబు ప్రశ్నించారు.