- భాష్యం స్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్ లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.
తాడేపల్లిగూడెం నియోజకవర్గం, ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. అందులో భాగంగా స్థానిక భాష్యం స్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్ లో ప్రచారం నిర్వహించి ఉపాధ్యాయులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేదని, కూటమి ప్రభుత్వం గడిచిన ఆరు నెలల కాలంలో చేసిన అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని, ఫిబ్రవరి 27వ తారీకు జరుగు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకె తమ విలువైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, పుల్లా బాబి, ఎన్వీ సత్యనారాయణ, అడబాల నారాయణమూర్తి, మైలవరపు రాజేంద్రప్రసాద్, మద్దాల మణికుమార్, పైబోయిన వెంకట్రామయ్య, అడబాల మురళీ, గట్టిమ్ నాని తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment