*సహకార సంఘాల బలోపేతం చేయడమే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లక్ష్యం
*సహకార సంఘాల్లో ఎలాంటి అవకతవకలను జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, సహకార సంఘాల బలోపేతం చేయడమే తన లక్ష్యమని అందుకు అధికారులు సహకరించాలని రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తెలిపారు. బుధవారం మత్స్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మత్స్యకారులు వినియోగించుకునేలా తోడ్పాటు అందించాలని కోరారు. సహకార సంఘాల్లో ఎలాంటి అవకతవకలను జరగకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశం లో జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీమతి నిర్మలా కుమారి ఇతర అధికారులు కోరారు.
Share this content:
Post Comment