ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసి వారికి న్యాయం చేయాలి: సుంకెట మహేష్ బాబు

మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా భైంసా ఎం.ఆర్.ఓ ఆఫీస్ ముందు ఐలమ్మ గద్దె వద్ద జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు ఎర్ర జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియ జేశారు. కార్మికులు 8 గంటలు పని చెయ్యాలి కాని యాజమాన్యం చట్టానికి వ్యతిరేకంగా ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్నారు. కార్మికుడు లేకుంటే ఉత్పత్తి జరగదు. అలాంటి శ్రామికుడికి ఎక్కడా గుర్తింపు లేదు. మహిళా కార్మికులకు పని ప్రదేశంలో ఎలాంటి సౌకర్యాలు, భద్రత లేదు. పని చేస్తున్న దగ్గర ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పనికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. కార్మికుడికి పి.ఎఫ్ సౌకర్యం కల్పించడం లేదు. ఆరోగ్య భద్రత లేదు.పేద మధ్య తరగతి కుటుంబాలకు పని కల్పించాలి. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దానివల్లకూరగాయలు, ఉత్పత్తుల ధరలు మార్కెట్లో పెరిగిపోయాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసి వారికి న్యాయం చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని సుంకెట మహేష్ బాబు తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో రమేష్, నవీన్, ముఖేష్, మహమ్మద్ రఫీ, వినోద్, లక్ష్మణ్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.