అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్

హైదరాబాద్: ఎన్‌హెచ్‌ఆర్‌డీ హైదరాబాద్ చాప్టర్, HYSEA భాగస్వామ్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై ఈ కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడారు. వృత్తిపరమైన అంశాలను మరింత సమానంగా కలుపుకొనిపోయేలా చేయడానికి వారి మద్దతుతో ముందుకు రావాలని ప్రోత్సహించారు.