అనంత గోవింద దాస ట్రస్ట్ చైర్మన్ గోవింద ప్రభోధానంద వారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ట్రస్ట్ ద్వారా నిర్వహించిన పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాల గురించి ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. త్వరలో రాజధాని ప్రాంతం నందు దక్షిణ భారత రాష్ట్రాల నుంచి స్వామీజీలతో ప్రముఖులు మరియు పెద్దల ఆధ్వర్యంలో తలపెట్టనున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి తగు సూచనలను, సలహాలను ట్రస్ట్ సభ్యులకు చిల్లపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు.
Share this content:
Post Comment