ప్రజా ఉద్యమాన్ని అణగదొక్కడానికి చూస్తే ప్ర‌భుత్వం త‌గిన మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది: పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌, ఆశావర్కర్లు న్యాయమైన తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తుండగా అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేయడం దారుణమని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ ఖండించారు. శుక్ర‌వారం త‌న కార్యాల‌యంలో విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ మాట్లాడుతూ జగన్ మోహ‌న్‌రెడ్డి ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం చేతకాక ముందస్తుగా నిర్బంధించడం దారుణమన్నారు. ఆశావర్కర్లు చేస్తున్న వెట్టి చాకిరికి ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ప్రజా ఉద్యమాన్ని అణగదొక్కడానికి చూస్తే ప్ర‌జా క్షేత్రంలో భంగ‌పాటు త‌ప్ప‌ద‌న్నారు. ఆశా వర్కర్లు కనీస వేతనం, సెలవులు, మెటర్నటీ లీవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌, పనిభారం తగ్గించాలని తదితర కోర్కెలతో గత కొంతకాలంగా ఆందోళన చేస్తూ ప్రశాంతంగా ధర్నాకు వస్తున్న ఉద్యోగులను అరెస్టు చేసి శాంతిభద్రతల సమస్యగా చేయడం సరైందికాదని విమర్శించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కారం కోసం వెళ్తుంటే ఆశాలను, నాయకులను అరెస్టులు చేయటం అప్రజాస్వామికమని, ఆశాల సమస్యలను పరిష్కరించకపోతే ప్ర‌భుత్వం త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు ఆశాలకు పూర్తి మద్దతుగా ఉన్నారని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారికి న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు.