కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి, పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం నియోజకవర్గ శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సలహాదారులు, మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్, మాజీ మంత్రివర్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, తెలుగుదేశం పార్టీ నర్సాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొత్తూరి రామరాజు బిజెపి ఇంచార్జ్ మేకల సతీష్ ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంగళవారం నరసాపురం నియోజకవర్గంలోని నరసాపురం పట్టణంలోని శివాలయం సెంటర్ గాంధీ విగ్రహం దగ్గర నుంచి మెయిన్ రోడ్డు స్టీమర్ రోడ్డు మరియు పలుచోట్ల ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని కలిసి, కరపత్రాలను పంపిణీ చేసి, మీ 1.వ ప్రాధాన్యత ఓటు పేరా బత్తుల రాజశేఖరంకు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, నిప్పులేటి తారక రామారావు, దొండపాటి స్వాములు, కొలచన పద్మ, శశి దేవి, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ మరియు జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment