గ్రామపంచాయతీ కార్యాలయ సహాయకులు అశోక్ ని పరామర్శించిన రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, టి.సుండుపల్లి మండలం, టి.సుండుపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దమాదిగపల్లి గ్రామనివాసి టి.సుండుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం సహాయకులు నథింగాళ్ల అశోక్ ఇటీవల మూడు నెలల క్రితం నుంచి పేరాలసిస్ అనారోగ్యంతో వీరుపాక్షపురం వైద్యుల వారి నాటు వైద్యం చికిత్సలందుకుంటూ వారి సలహాలతో స్వగృహం నందు విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న రాజంపేట నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మిత్రబృందంతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ దైర్యమే సగభలమని వైద్యాధికారుల సలహాలు సూచనలు సమయభావాన్ని తూచా ఎప్పటికప్పుడు తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, నాగేష్, వెంకటేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment