ఉపాధి హామీ పనుల నిమిత్తం గ్రామసభ

పి గన్నవరం: మామిడి కుదురు మండలం, లుటుకుర్రు గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనుల నిమిత్తం గ్రామసభ నిర్వహించడం జరిగినది. ఈ గ్రామ సభ ద్వారా నూతన పనులను చేయుటకు తీర్మానించడం అయినది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాత కాపు ఉపాధి హామీ పథకం జేఈ, సెక్రటరీ డి సురేష్, వార్డు సభ్యులు పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.