లూటుకుర్రు గ్రామపంచాయతీలో గ్రామసభ

మామిడికుదురు మండలం, లూటుకుర్రు గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభలో గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నది కావున నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును వెంటనే ప్రారంభించి నీటి ఎద్దడిని నివారించవలసిందిగా సర్పంచ్ అడబాల తాతకాపుకి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోట బ్రహ్మానందం, పంచాయతీ సెక్రెటరీ సూర్యనారాయణ రాజు, వార్డు సభ్యులు సచివాలయం సిబ్బంది వాలంటీర్స్, పిహెచ్సి సిబ్బంది గ్రామంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.