నరవ గ్రామంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలపై గ్రామసభ

88 వార్డ్, పెద నరవ గ్రామం, పెందుర్తి నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ 88 వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు నుండి మన నరవ గ్రామంలో అక్రమ క్వారీలు జరపడం వల్ల ప్రభుత్వ భూమిని నష్టపోతున్నామని, పర్యావరణ కూడా దెబ్బతింటుందని, రాత్రి సమయాల్లో తవ్వకాలు ఇష్టానుసారంగా జరపడం వల్ల వారికి ఇష్టం వచ్చిన దగ్గర గోతులు పెడుతున్నారని దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేయడానికి ఆ భూములు పనికి రాకుండా పోతున్నాయని, ప్రభుత్వాలు గ్రావెల్ తవ్వడానికి లైసెన్స్ లేకపోవడం వల్ల వాటిపై ఆధారపడిన యజమానులు ఇటువంటి పనులు చేస్తున్నారని, ప్రజలు కూడా గృహ నిర్మాణాల కోసం గ్రావెల్ కోసం ఈ యజమానుల చేత అక్రమంగా గ్రావెల్ ను వేయించుకుంటున్నారని, ఈ విధంగా చేయడం వల్ల అటు ప్రభుత్వానికి, మన నరవ గ్రామం అభివృద్ధి కూడా చాలా నష్టం చేకూరుతుందని, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందని అది చర్చిల ద్వారా పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చని అందుకోసం ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది అని, అనాధికారకంగా గ్రావెల్ తవ్వకాల్ని మనం ఎంకరేజ్ చేయకూడదని మాట్లాడడం జరిగింది, ఈ యొక్క మీటింగ్ లో కూటమి నాయకులు, ప్రతిపక్షం పార్టీ నాయకులు, మరియు గ్రామ ప్రజలు కూడా అనధికారికంగా గ్రావెల్ తవ్వకాలను జరపడాన్ని మనం ఆపాలని నిర్ణయం రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు గవర సత్తిబాబు, ఇల్లపు శ్రీను (ఎక్స్ ఎంపిటిసి), టిడిపి వార్డు అధ్యక్షులు గంతకోర శివకుమార్, మాజీ సర్పంచ్ గవర సంజీవరావు, వైఎస్ఆర్సిపి వార్డ్ ఇంచార్జ్ గండ్రెడ్డి మహాలక్ష్మి నాయుడు, జనసేన నాయకులు గల్ల శ్రీనివాసరావు, యువత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment