ఘనంగా సోమరౌతు అనురాధ జన్మదిన వేడుకలు

వేమూరు: జనసేన పార్టీ వీరమహిళ జిల్లా పార్టీ మహిళా కార్యదర్శి సోమ రౌతు అనురాధ జన్మదిన వేడుకలు వేమూరు మండల గ్రామాల్లో జనసేన పార్టీ వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అబ్బన గూడవల్లి, బలిజేపల్లి, కుచ్చళ్ళ పాడు గ్రామాల్లో సోమరోతు అనురాధ జన్మదిన పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు ఉచితంగా అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో సోమరౌత్ అనురాధ పాల్గొని జన్మదిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. సోమరౌతు అనురాధ జనసేన పార్టీ పటిష్టత కోసం ఎంతగానో పాటుపడుతున్నారని ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం వీరమహిళలు, నాయకులు బొందలపాటి మురళి, కృష్ణ, అంజలి, కోడూరు లక్ష్మి, బొందలపాటి వెంకటనారాయణ, లక్ష్మీ నరసమ్మ, కొండిశెట్టి వెంకయ్య అమ్మ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.