నంద్యాల బొగ్గు లైన్, గాంధీ నగర్, ఘట్టాల నగర్ జనసేన ఇన్చార్జ్ సింహాసనం నగేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వార్డు జనసేన కార్యకర్తలు బాణసంచా పేల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి రవి, సందీప్, సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బొగ్గు లైన్ వాసులకు తమ ఇల్లు కూల్చేటప్పుడు వార్డు ఇంచార్జ్ సింహాసనం నగేష్ తమకు తోడుగా ఉన్నారని, వారి సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారని తెలిపారు. వార్డులో ఉన్న జనసేన కార్యకర్తలకు ఇటీవలే సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను అందజేశారని తెలిపారు. సింహాసనం నగేష్ మాట్లాడుతూ వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, వార్డు అభివృద్ధి కొరకు కృషి చేస్తానని తెలిపారు. జనసేన పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు.
Share this content:
Post Comment