ఘనంగా చిల్లపల్లి జన్మదినోత్సవ వేడుకలు
మంగళగిరి, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రాత్రి జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అలాగే జనసైనికులు వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కు కట్టుబడి పనిచేయాలని రాబోయేది జనసేన-టిడిపి ప్రభుత్వమే అని అందరూ సంసిద్దమై పవన్ బాటలో ముందుకు నడవాలి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కష్టపడి పని చేసేవారికి భవిష్యత్ లో పవర్ తో పాటు నామినేటేడ్ పదవులు వస్తాయి అని దానికి నాది భరోసా అన్నారు. 2019 ఎన్నికలలో సిపిఐకి జనసేన మద్దతు ఇస్తే సుమారు 10 వేల ఓట్లు వచ్చాయి. రానున్న ఎన్నికలలో జనసేన-టిడిపి అభ్యర్దిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మంచి కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకు అందించారని, వారికి అండగా ఉంటానని చిల్లపల్లి అన్నారు. జనసేనకు బలం ఏమి అశించకుండా పని చేసేవారు ఉండటమే అన్నారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు చిల్లపల్లి శ్రీనివాసరావుతో భారీ కేక్ ను కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాసరావును పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు, టిడిపి నాయకులు వందలాదిగా పాల్గొని చిల్లపల్లి శ్రీనివాసరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-12-at-18.20.43-1024x683.jpeg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-12-at-18.20.44-1024x683.jpeg)