ఆత్మకూరు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఆత్మకూరు, బాలల దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆదేశాల మేరకు చేజర్ల మండలంలోని నడిగడ్డ అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేజర్ల మండల జనసేన పార్టీ ఇంచార్జ్ బండి అనిల్ రాయల్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాలని, విద్యార్థులందరూ ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కనకం హరీష్, అభిలాష రాయల్, శివాజీ, ఆదర్శ్ రాయల్, శశివర్ధన్ నాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు.