ఘనంగా డేటా సైన్స్ లాబ్ ప్రారంభోత్సవం

నరసాపురం: స్థానిక శ్రీ వై ఎన్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డేటా సైన్స్ లాబ్ ను నరసాపురం నియోజకవర్గం శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొమ్మిడి నారాయణ నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఓ. ఎన్. జి. సి. వారు కళాశాలలో డేటా సైన్స్ లాబ్ ను ఏర్పాటుకు పది లక్షల రూపాయలు ఇవ్వడం వారి దాతృత్వానికి నిదర్శనమని, వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని, బాగా చదువుకుని మీరు భవిష్యత్తులో మంచిస్థానాలలో స్థిరపడాలని, అందుకు మీరు బాగా చదవాలని’ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం ఓ. ఎన్. జి.సి. జి. జి. ఎం. స్నేహల్ రాహుల్కుండ్ మాట్లాడుతూ.. భవిష్యత్తు నిర్మాణానికి కావలసిన స్కిల్స్ నేర్చుకుని, భవిష్య నిర్మాణం మనమే చేసుకోవాలని, దానికి ఇక్కడ నుండే ఆరంభించాలని, ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని చేరుకోవడానికి మనం కష్టపడాలని, ఆ తరువాత సుఖ పడతామని’ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రెసిడెంట్ డా. చినమిల్లి సత్యనారాయణ రావు అధ్యక్షత వహించగా, కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు చేగొండి సత్యనారాయణ మూర్తి, ఆర్. వి.సుబ్బారావు, కోటిపల్లి వెంకటేశ్వర రావు, రాజమహేంద్రవరం ఓ. ఎన్. జి. సి. ఎస్సెట్ సి.జి.ఎం. హెచ్.ఆర్. ఆర్.ఎస్.రామారావు, చీఫ్ ఇంజనీర్ రాహుల్, పి.డి సుధీర్, యూనియన్ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ కొడవటి సురేష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతపల్లి కనక రావు, డా.సి.ఎస్.రావు పి. జి.సెంటర్ డైరెక్టర్ డా. నిమ్మల చింతారావు, వైస్ ప్రిన్సిపాల్ బెజవాడ వెంకట రత్నం, డా. కె. ఎస్.వి. రంగా రావు, డీన్ డా. గంధం శ్రీ రామకృష్ణ, హెచ్.ఆర్.డి. డైరెక్టర్ డా. చినిమిల్లి శ్రీనివాస్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment